Pawan Kalyan Tributes : గౌతమ్ రెడ్డి మరణం బాధాకరం : పవన్ కళ్యాణ్

UPDATED 21st FEBRUARY 2022 MONDAY 04:20 PM

Pawan Kalyan tributes : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి మరణం బాధాకరమని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ తనకు బాగా తెలుసు అన్నారు. రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నారని తెలిపారు. వ్యాపారంలో సంపాదించి, ప్రజల కోసం వెచ్చించారని పేర్కొన్నారు. వ్యక్తిగా గౌతమ్ రెడ్డి అంటే తనకు బాగా ఇష్టం అన్నారు. గౌతమ్ రెడ్డి మృతితో భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేశామని వెల్లడించారు. రాజకీయాల్లో వైరుధ్యాలు, విభేదాలుంటాయని తెలిపారు. అంతకముందు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని గౌతమ్ రెడ్డి నివాసానికి సీఎం జగన్ వెళ్లారు. మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us