ప్రగతిలో విజయవంతంగా ముగిసిన అవగాహనా సదస్సు

UPDATED 10th DECEMBER 2017 SUNDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో "ఆంగ్లభాషా బోధనలో నూతన ఆవిష్కరణలు" అనే అంశంపై ఐదురోజులు పాటు నిర్వహించిన అవగాహనా సదస్సు ఆదివారంతో విజయవంతంగా ముగిసినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల, అధ్యాపకుల పురోగతిని ప్రోత్సహించడానికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో తమ కళాశాల ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. ఆంగ్లభాషా బోధనా విధానం, భాషా ఉచ్చారణ, భాషా నైపుణ్యాల అంచనా, పాఠ్యాంశాలు, సిలబస్ రూపకల్పన వంటి అనేక ఉపయుక్తమైన అంశాలపై ముఖ్య అతిధులుగా పాల్గొన్న  డాక్టర్ సువర్ణ లక్ష్మి, ప్రొఫెసర్ కె. వెంకట రెడ్డి ఈ సదస్సులో తెలియచేశారన్నారు. కళాశాల  ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ ఆంగ్లభాషా విభాగం, ఔత్సాహిక పరిశోధకులకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని, తమ కళాశాల ఆంగ్ల భాషా విభాగం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విశేష కృషి చేశారన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్మెంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి.నరేష్, కార్యక్రమం కన్వీనర్ ఎం. మాధవి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us