UPDATED 26th JUNE 2017 MONDAY 4:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో 2017 -18 విద్యా సంవత్సరం బిటెక్ తరగతులు ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతాయని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల (ఎడిటిపి) లో చేరిన విద్యార్థులంతా తప్పనిసరిగా హాజరుకావాలని, ఇంజనీరింగ్ విధానంలో హాజరు ప్రాధాన్యం ఎంతో ఉందని, అటెండన్స్ తక్కువ కారణంగా కూడా ఎంతో మంది ఉత్తీర్ణత సాధించలేకపోయిన సందర్భాలు ఉన్నాయని, ప్రతి విద్యార్థి కళాశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని కోరారు. మూడు దశాబ్దాలకు పైబడి ఎందరో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మాకు అప్పగించిన గురుతర బాధ్యతలను స్వీకరించి ఉత్తమ ఫలితాలు సాధించడానికి తమ కళాశాల చేసే ప్రయత్నానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం అన్నారు. విద్యార్థి బంగారు భవిష్యత్తుకు ఈ నాలుగు సంవత్సరాల కాలం మనం కలిసి పనిచేయవలసిన ఆవశ్యకత మొదలైన అంశాలపైన ఈ నెల 28 న తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.







