సిద్ధి వినాయకునికి మూషిక వాహనం బహూకరణ

UPDATED 3rd JULY 2017 MONDAY 7:00 PM

అయినవిల్లి : తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి సిద్ధి వినాయకస్వామి వారి ఆలయానికి ఓ భక్తుడు వెండి  మూషిక వాహనాన్ని బహూకరించారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన యాగ శ్రీనివాస్‌ దంపతులు గతంలో సిద్ధి వినాయకస్వామి దర్శించుకున్నారు. తన మొక్కులో భాగంగా సుమారు రూ.14 లక్షలు వెచ్చించి 24 కిలోల వెండితో మూషిక వాహనాన్ని తయారు చేయించారు. ఈ మేరకు సోమవారం దాతలు ఆ వాహనాన్ని ఆలయ సూపరింటెండెంటు మూర్తి, అర్చకులు అయినవిల్లి సురేష్‌లకు అందించారు. దాతలను గ్రామస్థులు, భక్తులు అభినందించారు. వీరికి అర్చకులు సురేష్‌ వేద ఆశీర్వచనం చేసి శేష వస్త్రాలు సమర్పించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం స్వామి చిత్రపటాన్ని యాగ శ్రీనివాస్‌ దంపతులకు బహూకరించారు. ఆ తర్వాత మూషిక వాహనానికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో ఉంచారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us