Ramcharan: దుబాయ్‌లో రామ్‌ చరణ్‌ అభిమానుల సందడి..!

UPDATED 29th AUGUST 2022 MONDAY 07:00 PM

Ramcharan: దుబాయ్‌లో రామ్‌ చరణ్‌ అభిమానుల సందడి..!చిరుత అనే సినిమాలో చిరంజీవి కుమారుడిగా పరిచయం అయ్యి.. ఇప్పుడు ట్రిపులార్‌ అనే సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తీరుని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే రామ్‌ చరణ్‌కు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ కూడా ఎంతో పెద్దది అనే చెప్పాలి.

ట్రిపులార్‌ సినిమాతో రామ్ చరణ్‌ క్రేజ్‌ గ్లోబల్‌ లెవల్‌కు చేరిందనే చెప్పాలి. హాలీవుడ్‌ డైరెక్టర్లు, ప్రేక్షకులు సైతం రామ్‌ చరణ్‌కు ఫ్యాన్స్ గా మారారు.అయితే రామ్‌ చరణ్‌ క్రేజ్‌ని తెలియజెప్పే విషయం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్‌ వేదికగా ఆదివారం భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఆ స్టేడియంలో రామ్‌ చరణ్‌ అభిమానులు సందడి చేశారు. రామ్‌ చరణ్‌ మీసం తిప్పుతున్న ఫొటోని పట్టుకుని ఓ అభిమాని సందడి చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us