UPDATED 21st NOVEMBER 2017 MONDAY 8:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ మెహర్జీ దువ్వూరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ ప్రశంసించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. మేనేజ్మంట్ కళాశాలలో ఫైనాన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మెహర్జీ దువ్వూరి, పిజిడిఎం విద్యార్థులు మణిచంద్, వంశీలతో కలిసి ఇన్వెస్ట్ మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే పుస్తకాన్ని రచించి దాని విశేషాలను లోకేష్ కు వివరించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, తదితరులు ప్రొఫెసర్ మెహర్జీ దువ్వూరి, విద్యార్థులను అభినందించారు.







