Adani Group To Buy NDTV : మీడియా రంగంలోకి అదానీ.. NDTV‌ని హస్తగతం చేసుకునే దిశగా అడుగులు

UPDATED 23rd AUGUST 2022 TUESDAY 07:50 PM

Adani Group To Buy NDTV : వ్యాపార రంగంలో తిరుగు లేకుండా దూసుకుపోతున్న అదానీ గ్రూప్.. ఇప్పుడు మీడియాలోకీ ఎంట్రీ ఇస్తోంది. NDTV హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను పరోక్షంగా తమ గ్రూప్ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు అదానీ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. మరో 26శాతం వాటాల కొనుగోలుకు రెండు సంస్థలతో కలిసి అదానీ ఎంటర్ ప్రైజెస్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.

విశ్వప్రదాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ తో కలిసి పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి వాటాలను కొనుగోలు చేయనుంది అదానీ ఎంటర్ ప్రైజెస్. 4 రూపాయల ముఖ విలువ కలిగిన కోటి 67లక్షలకు పైగా షేర్లను ఈ సంస్థలతో కలిసి అదానీ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఒక్కో షేర్ కు 294 రూపాయలను ఆఫర్ చేసింది అదానీ సంస్థ. ఓపెన్ ఆఫర్లలో షేర్ల కొనుగోలుకు 492.8 కోట్లు చెల్లించనుంది. ఎన్డీటీవీని ప్రణయ్ రాయ్ ప్రారంభించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us