AP Corona Cases : ఏపీలో కొత్తగా 1,891 కరోనా కేసులు.. 5 మరణాలు

UPDATED 8th FEBRUARY 2022 TUESDAY 06:00 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,891 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో మరో ఐదుగురు చనిపోయారు. అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 10వేల 241 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 54వేల 040 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 26వేల 236 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,06,943. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,38,226. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 14,677కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 440 కేసులు వెలుగుచూశాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, సోమవారంతో(1,597) పోలిస్తే మంగళవారం పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us