TS News: డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్న తెలంగాణ

Updated 31 January 2022 Monday 10 AM

హైదరాబాద్(రెడ్ బీ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసు శాఖ ప్రణాళిక రూపోందిస్తోంది. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. అందులో భాగంగా డ్రగ్స్ నియంత్రణ కు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తోంది.

1000 మందితో స్పెషల్ నార్కోటిక్ సెల్‍‌టీమ్ ఏర్పాటుకు పోలీస్‌శాఖ కసరత్తు ప్రారంభించింది. డ్రగ్స్ నియంత్రణ‌కు ఇతర రాష్టాల్లో తీసుకుంటున్న చర్యలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పంజాబ్, హర్యానా రాష్టాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్, నార్కోటిక్ సెల్ చేస్తున్న చర్యలను పరీశీలిస్తున్నారు.

ఇందుకోసం తెలంగాణ ఎక్సైజ్ శాఖ, పోలీసుశాఖ సమన్వయంతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలు తీసుకోవాలని అదికారులు భావిస్తున్నారు. ప్రతి జిల్లాలో ఒక నార్కోటిక్ సెల్ ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. త్వరలోనే స్పెషల్ టీమ్ ఏర్పాటుకు విధివిధానాలు, కార్యాచరణను డీజీపీ నివేదిక రూపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందించనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us