ప్రతీ పేద కుటుంబానికి పక్కా గృహం

UPDATED 5th JULY 2018 THURSDAY 8:00 PM

సామర్లకోట: రాష్ట్రంలో 2022 నాటికి ప్రతీ పేద కుటుంబానికి పక్కా గృహం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జిల్లాలో రెండవవిడత ఎన్టీఆర్ సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని గురువారం శిలాఫలక ఆవిష్కరణతో లాంఛనంగా ప్రారంభించారు. వేట్లపాలెం గ్రామంలో ఎన్టీఆర్ రూరల్ పథకం క్రింద ఇళ్లు నిర్మించుకున్న 120 మంది లబ్ధిదారుల గృహాలను మంత్రి ప్రారంభించి, నూతన గృహాల ముంగిట వనం-మనం కార్యక్రమం క్రింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్థానిక కన్నయ్యకాలనీలోని శ్రీ బేతాళస్వామి ఎన్టీఆర్ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రతీ పేద కుటుంబానికి పక్కా గృహం నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించి సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 19 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే రెండు విడతలుగా లబ్దిదారులతో గృహప్రవేశాలు చేయించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండవ విడత ఎన్టీఆర్ సామూహిక గృహప్రవేశ కార్యక్రమం క్రింద రాష్ట్రంలో మూడు లక్షల నూతన గృహాలు ప్రారంభమౌతుండగా, అత్యధిక సంఖ్యలో తూర్పుగోదావరి జిల్లాలో 3,72,017 గృహాలు ప్రారంభం అయ్యాయన్నారు. ఇందులో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలో 20 కోట్ల 61 లక్షల నిధులతో 1374 గృహాలు నిర్మించడం జరిగిందని, వివిధ దశల నిర్మాణంలో ఉన్న మిగిలిన గృహాలను త్వరలోనే పూర్తికానున్నాయన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నియోజకవర్గంలో వేట్లపాలెం గ్రామం అన్నిటా ముందు నిలుస్తోందని, రూ.10 కోట్ల నిధులతో గ్రామంలోని రోడ్లను అభివృద్ధి చేశామన్నారు. ఏపీఐఐసీకి కేటాయించిన 10 ఎకరాల స్థలం తిరిగి వెనకకు తీసుకుని గ్రామంలోని ఇళ్ళ స్థలాలు లేని నిరుపేదలకు కేటాయిస్తామని, తద్వారా మరో వెయ్యిమందికి లబ్ది చేకూరుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ రెండవ విడత ఎన్టీఆర్ గృహప్రవేశాల కార్యక్రమలో అత్యధిక గృహాలను ప్రారంభిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలవడం ముదావహమన్నారు. వేట్లపాలెం గ్రామం అన్ని అంశాల్లోను ఆదర్శంగా నిలుస్తోందని, అతి తక్కవ స్థలంలో అందమైన, సౌకర్యవంతంగా ఇళ్ళు నిర్మించుకున్న లబ్దిదారులను ఆయన అభినందించారు. అనంతరం గ్రామంలో రూ. 7.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఫిష్ మార్కెట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో సామర్లకోట ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, జెడ్పీటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మి, ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ఉపసర్పంచ్ వల్లూరి శ్రీనివాస్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చైర్మన్ అడబాల కుమారస్వామి, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, హౌసింగ్ పిడి జి. వీరేశ్వరప్రసాద్, కాకినాడ ఆర్డీవో ఎల్. రఘుబాబు, పెద్దాపురం, సామర్లకోట ఎంపిడివోలు వసంత మాధవి, స్వప్న తహసీల్దార్ ఎల్. శివకుమార్, హౌసింగ్ డిఈ వై. శ్రీనివాస్, ఎఇలు ఎస్.ఎస్. చౌదరి, టి.ఎల్. శ్రీనివాసరావు, వేణుగోపాలరావు, గుమ్మళ్ళ రామకృష్ణ, తోటకూర శ్రీను, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us