UPDATED 7th FEBRUARY 2022 MONDAY 06:20 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,597 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 8మంది కోవిడ్ తో మరణించారు. విశాఖపట్నంలో ఇద్దరు.. చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు.
అదే సమయంలో ఒక్కరోజే 8వేల 766 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 62వేల 395 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 18వేల 601 కోవిడ్ పరీక్షలు చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 3,26,79,288 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,672కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,05,052. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 22,27,985.







