ఆధునిక పద్దతులతో అధిక దిగుబడులు

Updated 12th April 2017 Wednesday 2:15PM

పెద్దాపురం: రైతులు ఆధునిక వ్యవసాయ పద్దతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ఎం. రత్న ప్రశాంతి పేర్కొన్నారు. మండలంలోని పులిమేరు గ్రామంలో కోలా సూరిబాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రం లో నిర్వహించిన పంట కోత ప్రయోగ కార్య క్రమంలో ఆమె పాల్గొన్నారు. రైతు పండించిన విత్తన రకం ఎంటియు 1010 దిగుబడిని పరీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జాతీయ బీమా పథకంలో భాగంగా పంటకోత ప్రయోగ కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయ పద్దతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. సేంద్రీయ సాగు చేపట్టేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. పంట కోత ప్రయోగాల ద్వారా పంటల దిగుబడులను అంచనా వేయడం జరుగుతుందని ఏడీఏ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారిణి కొల్లి ద్వారకాదేవి, వ్యవసాయ విస్తరణాధికారి గడియారం రామకృష్ణ, రైతులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us