ఆదిత్యలో ఎల్.ఎల్.ఆర్. మేళా ప్రారంభించిన హోం మంత్రి చినరాజప్ప

UPDATED 15TH DECEMBER 2017 FRIDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎల్.ఎల్.ఆర్. మేళా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరైనారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అధ్యక్షత వహించిన సభలో చినరాజప్ప మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. అవసరమైన సందర్భాలలో తప్ప అనవసరంగా వాహనాలను వినియోగించడం మానుకోవాలని, విద్యార్థులు కాలేజ్ బస్సులో వచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకుని రోడ్ నియమాలు పాటిస్తూ తక్కువ వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురికాకుండా ఉండవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ.డి.బి. రోడ్డులో ప్రమాదాల సంఖ్య తగ్గాయని, ప్రతీ పది కిలోమీటర్ల దూరంలో ఒక పెట్రోలింగ్ వాహనం ఉంచి వాహనాలు అధిక వేగంతో వెళ్లకుండా నియంత్రిస్తున్నామన్నారు. అనంతరం వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా రవాణా శాఖ నిర్వహించిన ఈ మేళాను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకుని లైసెన్సులు పొందాలని, ఈ మేళా తమ క్యాంపస్ లో నిర్వహించిన రవాణా శాఖకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, పెద్దాపురం డివిజన్ మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ పద్మాకర్, డిఎస్పీ చిలకా వెంకట రామారావు, జగ్గంపేట సిఐ, రవాణా శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us