బకాయిలను తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోండి

UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: బకాయిలను తక్షణమే చెల్లించేల చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే షాపులకు సంబంధించి ఒక్కొక్క షాపు యజమాని రూ. 1.50 లక్షల నుంచి రూ. మూడు లక్షల వరకు బకాయి ఉన్నారని కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ప్రజా సమస్యలపై చర్చించడానికి జీరో అవర్ ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు సూచనల మేరకు యజమానులు 20 నుండి 28 నెలల వరకు బకాయిలు ఉన్నారని మేనేజర్ జయకర్ తెలిపారు. ఇంతకాలం ఉండటం వల్లే ఇంత పెద్ద మొత్తం అయ్యిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. సిబ్బందికి ప్రతి నెల జీతాలు రావడంతో ఆదాయంపై శ్రద్ధ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని భారీ భవన నిర్మాణాలు జరుగుతున్నా గుర్తించలేకపోవడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్ష సభ్యులు తప్పుబట్టారు. అలాగే రాత్రి సమయంలో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని మన్యం చంద్రరావు ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆరు ఎకరాల విస్తీర్ణంలో కంపోస్ట్ యార్డు ఉండగా దానిని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు. దీనితో దానికి రోడ్డు మార్గం లేకనే ఉపయోగించడం లేదని కమిషనర్ చెప్పారు. దానికి రోడ్డు మార్గం ఉందని ప్రతిపక్ష నాయకులు పేర్కొన్నారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us