మార్కెట్ యార్డు నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన జెసి మల్లిఖార్జున

UPDATED 7th MARCH 2018 WEDNESDAY 8:30 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ఉన్న విస్తరణ శిక్షణ కేంద్రంలో  ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని వాడుకలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జున పేర్కొన్నారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రం భూముల్లో మార్కెట్ యార్డు నిర్మాణానికి శిక్షణా కేంద్రం భూములను ఆయన బుధవారం పరిశీలించారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి అభ్యంతరాలు రావడంతో జిల్లా కలెక్టర్ కేటాయించిన భూములను ఉపయోగించకుండా నిరుపయోగంగా ఉంచితే వాటిని స్వాధీనపరచుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. అనంతరం జెసి మాట్లాడుతూ జిల్లాలో 2500 రేషన్ కార్డులు వివిధ కారణాల వలన తిరస్కరించడం జరిగిందని, అయితే వాటిని రెవెన్యూ అధికారులు పరిశీలించి స్థానికంగా కార్డులు మంజూరు చేయడానికి వీలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో ఎల్. రఘుబాబు, తహసీల్దార్ ఎల్. శివకుమార్, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ మూర్తి, ఎస్టేట్ మేనేజర్ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us