UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 09:00 AM
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఊహించని ఘటన జరిగింది. ఇల్లందు మండలం కొమరవరం పరిధిలోని కాచన పల్లి పోలీస్ స్టేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ సంఘటనలో హెడ్ కానిస్టేబుల్ సంతోశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాచన పల్లి పోలీస్ స్టేషన్ లో ఎప్పటిలాగే నిన్న నైట్ డ్యూటీకి వచ్చారు హెడ్ కానిస్టేబుల్ సంతోష్. ఈ తెల్లవారు జామున విధుల్లో భాగంగా ఆయుధాలను పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీస్ అధికారులు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ సంతోష్ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ దవాఖానాకు తరలించారు పోలీసులు. ఉన్నతాధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించిన తర్వాత.. పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కు షిఫ్ట్ చేసినట్టు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిపార్టుమెంట్ ను షాక్ కు గురిచేస్తోంది.







