UPDATED 13th DECEMBER 2017 WEDNESDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మొదటి సంవత్సరం బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్న విద్యార్థి ఎల్.ఎస్.ఆర్.ఎస్. సురేష్ రాజు జె.ఎన్.టి.యూ.కె. పరిధిలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ద్వితీయస్థానం పొందినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టెక్కలిలో నిర్వహించిన 105 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి ద్వితీయస్థానం కైవసం చేసుకుని సిల్వర్ మెడల్ గెలుపొందినట్లు ఆమె తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ జి.సుమ, ఫిజికల్ డైరెక్టర్ ఎం.దుర్గాభవాని, అధ్యాపక సిబ్బంది, తదితరులు విద్యార్థిని అభినందించారు.







