రెడ్ బీ న్యూస్ 28 ఆక్టోబర్ 2021: ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఊహకందని సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు రాజమౌళి టీమ్. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ రౌద్రం రణం రుధిరం. ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా మేకర్స్ ఓ ఆసక్తికరమైన అప్డేట్ను రివీల్ చేశారు. "ఈ అక్టోబర్ 29న ప్రపంచంలోని ఏ చిత్రానికి ఇంతకు ముందెన్నడూ చూడని, వినని కొలాబరేషన్‌ను చూడటానికి సిద్ధంగా ఉండండి".. అని రాజమౌళి టీమ్ ట్వీట్ చేసింది. దాంతో వీరు ఇవ్వబోతున్న అప్డేట్ ఏంతో అనే ఆసక్తితో అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ 10 భాషలలో రిలీజ్ కానుంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, అజయ్ దేవగణ్, శ్రియ శరణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు.







