ప్రగతిలో నేషనల్ లెవెల్ వర్క్ షాప్

UPDATED 22nd FEBRUARY 2018 THURSDAY 8:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రోబోకార్ట్ ముంబయి సహకారంతో నేషనల్ లెవెల్ వర్క్ షాప్ ఆన్ గ్రీన్ బిల్డింగ్స్ అండ్ స్మార్ట్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్స్ పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపాన్యాసకులుగా ఎం. సుదర్శన్ వర్మ, కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ భావిభారత ఇంజినీర్లకు గ్రీన్ బిల్డింగ్స్ అండ్ స్మార్ట్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్స్ పై అవగాహన ఎంతో ముఖ్యమని, వాటి ఫండమెంటల్స్ , ఉపయోగాలను విద్యార్థులకు తెలియచేయడం ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. పర్యావరణం, కాలుష్య నివారణా చర్యలు గురించి రోబోకార్ట్ నుంచి విచ్చేసిన సుదర్శన్ వర్మ ద్వారా సమాచారం గ్రహించాలన్నారు. సొంత ఇల్లు అనేది ప్రతీ ఒక్కరి కల అని, ఈ కలను సార్ధకం చేసి గొప్ప ఇంజనీర్లుగా మనం మారాలంటే నూతన టెక్నాలజీ గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ శంభూప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఇంజనీరింగ్ విద్యార్థులు నూతన పోకడలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు టెక్నాలజీలో విస్తరిస్తున్న నూతన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆర్.వి.ఎస్. రామకృష్ణ, ఫాకల్టీ కో-ఆర్డినేటర్లు వి. రాజు, డి.ఎస్.ఎస్.ఎస్.అన్నపూర్ణ, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us