హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ సమావేశమైంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నారు. కరోనా పరిస్థితులు, వైద్యారోగ్యశాఖ సన్నద్ధతను మంత్రి హరీశ్ రావు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. వైరస్ వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలు, మరిన్ని ఆంక్షల విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 30వ తేదీ వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో విద్యాబోధన విషయమై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.







