రాష్ట్ర ప్రయోజనాలే టిడిపి ప్రభుత్వ ముఖ్య ధ్యేయం

* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల  చినరాజప్ప 
* సామర్లకోటలో ఉత్సాహంగా సాగిన సైకిల్ యాత్ర
UPDATED 1st JUNE 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్ర ప్రయోజనాలే టిడిపి ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడి సాధించి తీరుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా పార్టీ పిలుపు మేరకు మండల పరిధిలోని స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి స్టేషన్ సెంటర్ వరకు నిర్వహించిన సైకిల్ యాత్రలో మంత్రి శుక్రవారం కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని, సైకిల్ యాత్రల ద్వారా రాష్ట్ర ప్రజల్లో మరింగా చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. తెలుగు ప్రజల సత్తాను చాటే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నాలుగేళ్లు మిత్రపక్షంగా ఉన్న కేంద్రం కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలుగా అభివృద్ధి చెందటానికి సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటిస్తుందని ఎదురు చూసినా చివరి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవటంతో టిడిపి ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆర్థిక సాయం చేస్తామని రెండేళ్ల కిందట కేంద్రం ప్రకటించినా నిధులు విడుదల చేయకపోవటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు), ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, భీమేశ్వర ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్, పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us