నిరంతర సాధనే ఉత్తమ ఉపాధ్యాయుని లక్షణం

UPDATED 9th JUNE 2017 FRIDAY 5:00 PM

గండేపల్లి: నిరంతరం తెలుసుకోవాలనే తపన నిరంతర సాధన ఉత్తమ ఉపాధ్యాయుల లక్షణమని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయ సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై శుక్రవారం మాట్లాడారు. వెలుగుతున్నదీపమే మరిన్నిదీపాలను వెలిగిస్తుంది. అలాగే నిరంతరం తెలుసుకోవాలనే తపన ఉపాధ్యాయుణ్ణి ఉత్తమ ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దుతుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ఆధునిక సమాజంలో మనకు తెలియని ఎన్నో విషయాలు నిరంతరం ఉంటాయని వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జ్ఞాన సముపార్జన సాధించాలన్నారు. ఉపాధ్యాయులు తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడే విద్యార్థులకు చక్కని విద్యాభోధన అందించగలరన్నారు. అనంతరం విజయనగరానికి చెందిన ఎం.వి.జి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల హెచ్ ఓ డి ప్రొఫెసర్ ఎ. సీతారామరాజు అటానమస్ విధి విధానాలపై అవగాహన కల్పించారు. అలాగే గాయత్రి విద్యా పరిషత్ (విశాఖపట్నం) కు చెందిన సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం.బి. వెంకటేశ్వర్లు స్టాటస్టిక్స్ విత్ ఆర్ ప్రోగ్రామింగ్ అనే అంశంపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. అనంతరం కళాశాల క్యాంపస్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ స్టేటస్ పొందిన సందర్భంగా అందుకు సంబందించిన విధి విధానాలు అనే అంశం పై అధ్యాపకులకు అవగాహన కల్పించామని అలాగే ఈ కార్యక్రమం రెండవ రోజు కూడా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, హెచ్ఓడీలు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us