ములుగు (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: ములుగు జిల్లా వెంకటాపురంలో జవాన్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్‌కు చెందిన జవాన్ల మధ్య కాల్పులు జరగడంతో ఓ జవాను మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వెంకటాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘటన జరిగింది. కాల్పులు జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.







