Crime News: భారత క్రికెట్‌ జట్టులో చోటు కల్పిస్తామని టోకరా

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021‌: ‘మేం.. మానవ హక్కుల కమిటీ ప్రతినిధులం.. భారత క్రికెట్‌ జట్టులో అవకాశం కల్పిస్తాం’ అని చెప్పి ఓ యువ క్రికెటర్‌ నుంచి నగదు కాజేశారు సైబర్‌ కేటుగాళ్లు. బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనంప్రకారం.. టోలిచౌకికి చెందిన యువతి, ఆమె సోదరుడు క్రికెటర్లు. సెప్ట్టెంబరు 29న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి.. ‘మీరు, మీ సోదరుడు క్రికెటర్లని తెలిసింది, మీలాంటి ప్రతిభావంతులే భారత జట్టుకు అవసరం, అవకాశం కల్పిస్తాం’ అని చెప్పారు. బాధితురాలు నమ్మారు. అవతలి వ్యక్తి కోరినట్లుగా రూ.1.25లక్షలు బదిలీచేశారు. అవతలి వ్యక్తి రెండున్నర నెలలుగా వీరిని బుకాయిస్తూ వచ్చారు. గట్టిగా నిలదీయగా.. క్రికెట్‌ కమిటీవారు మరికొంత డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని చెప్పాడు. మోసాన్ని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయంచారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us