ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

UPDATED 19th AUGUST 2017 SATURDAY 5:00 PM

పెద్దాపురం: పట్టణంలో 178వ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్దాపురం పట్టణ, రూరల్ గ్రామాల ఫోటోగ్రాఫర్లు శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయీస్ డాగురే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక వేంకటేశ్వరస్వామి గుడి సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి ఆంజనేయస్వామి గుడి సెంటర్లో కేక్ ను కట్ చేశారు. అనంతరం సీనియర్ ఫొటోగ్రాఫర్లు పలువురు మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వారికి ప్రభుత్వం మరింత ప్రోత్సహాన్నిఅందచెయ్యాలన్నారు. ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించు కుని ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మండల ప్రొఫెషనల్ ఫోటో&వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పోసిన వీరేంద్ర (బుజ్జి), తోట రామకృష్ణ (మురళి), కోశాధికారి అనుకుల విజయ్, బాడీ మెంబర్లు ఉపాధ్యక్షులు మల్లోజు రాజగోపాల్, సహాయ కోశాధికారి జి.హరిప్రసాద్, వెబ్ ఇంజనీర్ సబ్బరపు రవీంద్ర, మల్లోజు నాగేంద్ర, రామారావు, వేము భాస్కరరావు, మాజీ కార్యవర్గ సభ్యులు ఎ.వి. రమణమూర్తి, ఎస్. లోవరెడ్డి, వి.డి.ఎస్. ప్రసాద్, అధిక సంఖ్యలో మండలం ఫొటో,వీడియో గ్రాఫర్స్ హాజరయ్యారు.
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us