UPDATED 2nd NOVEMBER 2017 THURSDAY 5:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు నేషనల్ విజిలెన్స్ అవగాహనా వారోత్సవాల్లో భాగంగా అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆదిత్య గ్రంథాలయ శాఖ, పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుతో పాటు పాల్గొన్న విద్యార్థులందరికి ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి, గ్రంథాలయ అధికారి కె. అశోక్ కుమార్, అసిస్టెంట్ లైబ్రేరియన్ సి.హెచ్.వేణు, పవర్ గ్రిడ్ ప్రతినిధులు పాల్గొన్నారు.







