UPDATED 15th FEBRUARY 2022 TUESDAY 09:00 PM
హైదరాబాద్: హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. మలక్‌పేట్-ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్స్ తయారీ ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10మంది అంతర్ రాష్ట్ర నిర్వాహకుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు తెలిపారు.
”నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశాము. రెండు ముఠాలను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నాం. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని వారికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అమ్ముతున్నారు. ప్రతి డిగ్రీకి ఒక రేటు ఫిక్స్ చేశారు. కావాల్సిన డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి.. శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ కన్సల్టెన్సీ పెట్టాడు. టెలీకాలర్లు.. ఫెయిల్ అయిన విద్యార్థులకు కాల్ చేసి వారిని రప్పిస్తున్నారు.







