ఆదిత్యలో ఘనంగా ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం

UPDATED 15th JULY 2017 SATURDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల లో ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని(వరల్డ్ యూత్ స్కిల్ డే) పురస్కరించుకుని యువతకు పలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి కేంద్రం (APSSDC) సహకారంతో, ఆదిత్య గ్రంధాలయ విభాగం ఆధ్వర్యంలో "యంగ్ ఇండియా-స్కిల్ ఇండియా" అనే అంశంపై వ్యాసరచన, పోస్టర్ ప్రెజంటేషన్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వారిలో గల సృజనాత్మకతకు పదును పెట్టారు. అనంతరం కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద చెప్పినట్లు సమస్త శక్తి మనలోనే ఉందని, దానిని బహిర్గతపరిచి అభివృద్ధి చేసి ప్రపంచ అభ్యున్నతికి ఉపయోగించడమే విద్య యొక్క పరమావధి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా- స్కిల్ ఇండియా నినాదం సాధనకు యువత సహకరిస్తే దానిని సాధించవచ్చని, ప్రపంచంలో అత్యంత శక్తి సామర్ద్యాలు గల యువత భారతదేశ సొంతమని వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి భావితరాల అభివృద్ధికి ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం కళాశాల డైరెక్టర్ ఎం. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న వివిధ ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, అలాగే అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమాలకు హాజరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వకృత్వం పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్న వి. బిందు మౌనిక, జ్యోతి మౌనిక, ఉస్మాన్ ఆలీఖాన్ , అలాగే పోస్టర్ ప్రెజంటేషన్ లో శ్వేత, అనుపమ, యామినిఅపర్ణ , పి.అపర్ణ, సంతోషిణి, హన్సిక, దుర్గా భవాని, దేవి, ప్రసన్న బృందాలను ఎంపిక చేసి వారికి ప్రశంసా పత్రాలు బహుమతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో APSSDC సంస్థ ప్రతినిధులు గౌతమ్, నాగయ్య, ప్రేమ్ కుమార్, సీమెన్స్ ల్యాబ్ ట్రైనర్స్, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ఫార్మసీ కళాశాల క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ కె.రవి శంకర్, గ్రంధాలయ విభాగ సిబ్బంది పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us