సామాజిక సేవలో లెనోరా దంత వైద్య కళాశాల

UPDATED 2nd FEBRUARY 2018 FRIDAY 9:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి యాజమాన్యం, బిడిఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు సంయుక్తంగా మండలంలోని ఫరిజెల్లిపేట గ్రామంలోని  ప్రభుత్వ పాఠశాలకు రూ.18 వేలు ఖర్చుతో శుక్రవారం వాటర్ ట్యాంక్ ను బహూకరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి, కార్యదర్శి వై. మధుసూదన్ రెడ్డి  మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా గ్రామాలలోని  ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని, అందులో భాగంగా ఫరిజెల్లిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన వాటర్ ట్యాంక్ తో పాటు పైప్ లైన్ ను ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో లెనోరా డైరెక్టర్లు డాక్టర్ జి.నాగార్జునరెడ్డి, ఎ. ప్రసాద్ చౌదరి, చిన్న పిల్లల దంత విభాగం నిపుణులు డాక్టర్ వి.వి.రావు, డాక్టర్ పునీత, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వ ప్రకాష్ శెట్టి,  పీఆర్వోలు రాంబాబు, కుమార్, దంత కళాశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.              

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us