UPDATED 24th OCTOBER 2017 TUESDAY 6:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఆర్ధిక వ్యవస్థపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (NISM) నవీ ముంబయికి చెందిన డీన్ కె. సుకుమారన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ధిక వ్యవస్థ పటిష్టం చేసుకునే విధానం, షేర్ మార్కెట్, సెబీ కార్యకలాపాలు, దేశ ఆర్ధిక వ్యవస్థలో నగదు యొక్క ప్రాముఖ్యత, డిజిటల్ ఫైనాన్సింగ్ సిస్టంను ఉపయోగించే విధానం గురించి విశ్లేషణాత్మకంగా విద్యార్థులకు వివరించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.విశాలాక్షి మాట్లాడుతూ దేశం బ్యాంకుల పనితీరు, నగదు నిల్వలపై ఆధారపడి ఉంటుందని, నగదు జీవితంలో అన్ని కార్యకలాపాలకు అనుసంధానమైనదని, జాగ్రత్తగా పొదుపు చేసినట్లయితే భవిష్యత్ తరాలకు భరోసా కల్పించవచ్చని విద్యార్థులకు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.







