ప్రజా సంక్షేమ పథకాలు అమలు టిడిపికే సాధ్యం

UPDATED 18th OCTOBER 2017 WEDNESDAY 6:30 PM

పెద్దాపురం: ప్రజా సంక్షేమ పథకాలు అమలు టిడిపికే సాధ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఆయన పాల్గొని బుధవారం మాట్లాడారు. ముందుగా సీనియర్ టిడిపి నాయకుడు పచ్చిపాల సత్తిబాబు, యువ నాయకుడు పచ్చిపాల సతీష్ ఆధ్వర్యంలో ఆయనకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి గ్రామవీధుల్లో పర్యటించి సమస్యలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున హారతులిచ్చి ఆయనకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి టిడిపి ఈ ఇంటింటికి టిడిపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రతీ గ్రామానికి కావలసిన మౌలిక వసతులు కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. అనంతరం గ్రామంలో రూ.15 లక్షలు వ్యయంతో నిర్మించతలపెట్టిన పంచాయతీ  భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.55 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను మంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి చంద్రన్న భీమా పథకం కింద రెన్యువల్ బాండ్లును ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందచేశారు. అలాగే నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం, సామర్లకోట ఎఎంసి చైర్మన్లు ముత్యాల వీరభద్రరావు( రాజబ్బాయి), పాలకుర్తి శ్రీనివాసాచార్యులు (శ్రీనుబాబు), ఎంపిపి గుడాల రమేష్, జెడ్పిటిసి సుందరపల్లి శివ నాగరాజు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి),  ఎఎంసి వైస్ చైర్మన్ ఆచంట రాజబాబు, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనె రామారావు, అన్నవరం దేవస్థానం  ధర్మకర్తల మండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, పాలచర్ల ఉమామహేశ్వరావు, పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, పంచాయతీ రాజ్ డీఈ వై. హరినాథరావు, జేఈ ఎం.రామకృష్ణయ్య, ఎపిఎం వేదకుమారి, సర్పంచ్ వంగలపూడి వీరాయమ్మ, త్రిమూర్తులు, అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.        
                     
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us