Sarkaru Vaari Paata: రొమాంటిక్ వైబ్స్ క్రియేట్ చేస్తున్న కళావతి.. పక్కా డ్యూయెట్టేనా?

UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 03:30 PM

Sarkaru Vaari Paata: మహేశ్ బాబు సర్కారు వారి పాట నుంచి కళావతి సాంగ్ వాలెంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ కానుంది. లేటెస్ట్ గా ఆ సాంగ్ లో నుంచి ఒక స్టిల్ రిలీజ్ అయ్యింది. ఆ ఫోటో చూసిన మహేశ్ ఫాన్స్ కు గతంలో మహేశ్ బాబు చేసిన సినిమాలన్నీ గుర్తొస్తాయి. ప్రిన్స్ డ్యూయట్ సాంగ్ విజువల్స్ ఇమాజినేషన్ లో కనిపిస్తాయి. క్యాజువల్ గానే మహేశ్ బాబు సినిమాల్లో హీరో హీరోయిన్స్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. డ్యూయట్ సాంగ్స్ మెమరబుల్ గా ఉంటాయి.

ఇప్పడొస్తున్న కళావతి సాంగ్ కూడా మహేశ్ ఫాన్స్ లో ఆ హోప్ క్రియేట్ చేస్తుంది.ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్బంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేసింది సర్కారు వారి పాట టీమ్. దాంతో ఫాన్స్ బిజెనెస్ మాన్ లో కాజల్ తో చేసిన ఐ లవ్ యూ అంటే ఛీ కొట్టి పోతావ్ సాంగ్ లా ఉంటుందా, దూకుడులో సమంతతో చేసిన ఇటు రాయే ఇటు రాయే పాటలా ఆకట్టుకుంటుందా, అంటూ మహేశ్ బాబు పాత సినిమాల డ్యూయట్ సాంగ్స్ అన్నీ గుర్తు చేసుకున్నారు. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ డ్యూయట్ సాంగ్ ఎక్స్ పెక్ట్ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us