పాఠశాలకు ఎల్ సి డి ప్రొజెక్టర్ బహూకరణ

UPDATED 6th FEBRUARY 2018 TUESDAY 9:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి యాజమాన్యం, బిడిఎస్ తృతీయ సంవత్సరం విద్యార్థులు స్థానిక ప్రభుత్వ మోడల్-2 పాఠశాలకు రూ. ఎనిమిది వేలు విలువైన ఎల్ సి డి ప్రొజెక్టర్ ను మంగళవారం బహూకరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న బాలలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రొజెక్టర్ ను బహూకరించామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లెనోరా డైరెక్టర్ ఎ. ప్రసాద్ చౌదరి, చిన్న పిల్లల దంత వైద్య విభాగం వైద్యులు డాక్టర్ పునీత, సి ఎఫ్ వో  సాగర్ రెడ్డి, పిఆర్వోలు రాంబాబు, కుమార్, దంత వైద్య కళాశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us