Movie Tickets Issue: ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. అయితే.. ఇది ఫిబ్రవరిలో తగ్గుముఖం పడుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. దీంతో సినీ మేకర్స్ ఫిబ్రవరి నుండి సినిమాల విడుదలకి సిద్ధమవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సహా రవితేజ ఖిలాడీ, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు, నిఖిల్ 18 పేజెస్ సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి.
ఫిబ్రవరి నుండి ప్రతి వారం సినిమాలు విడుదల అవుతాయని నిర్మాత, డిస్టిబ్యూటర్ దిల్ రాజు కూడా ప్రకటించేశారు. నిర్మాతల మండలి తరపున దిల్ రాజు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫిబ్రవరి నుండి సినిమాల విడుదలకి ముహుర్తాలు సరే అప్పటికి సినిమా టికెట్ల వివాదం పరిష్కారమవుంటుందా అనే చర్చ మొదలైంది. ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.







