ఘనంగా ప్రారంభమైన జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్

UPDATED 19th DECEMBER 2017 TUESDAY 5:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో మూడురోజుల పాటు జరగనున్న జిల్లాస్థాయి 22వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఈ పోటీలకు చీఫ్ గెస్ట్ గా తూర్పుగోదావరి జిల్లా సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్ని, ముఖ్య అతిధులుగా జె.ఎన్.టి.యూ.కె. రెక్టార్ డాక్టర్ కె. పూర్ణానందం, ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.ఎస్.వరప్రసాద్ హాజరైనారు. జిల్లాలోని 39 కళాశాలలకు చెందిన 15 వందల మంది విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమం జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఎస్.పి. విశాల్ గున్ని మాట్లాడుతూ జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్-2017 పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని, ఈ పోటీలు పూర్తి స్నేహపూర్వక వాతావరణంలో జరగాలన్నారు. జీవితంలో ప్రతీ రోజు, ప్రతీ నిమిషం ఎంతో విలువైనదని, జీవితంలో ఎదురయ్యే ప్రతీ ఛాలెంజ్ దృఢ సంకల్పంతో ఎదుర్కోవాలని, విద్యార్థులంతా భవిష్యత్తులో మంచి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జె.ఎన్.టి.యూ.కె. రెక్టార్ డాక్టర్ కె. పూర్ణానందం మాట్లాడుతూ క్రీడల్లో రాణించినవారు జీవితంలో సైతం విజేతలుగా నిలుస్తారని, జిల్లాస్థాయిలో జరుగుతున్న ఈ పోటీలు సకల సౌకర్యాలకు నిలయమైన ఆదిత్య విద్యా సంస్థలు వేదిక కావడం క్రీడాకారులకు గొప్ప  వరం అన్నారు. అనంతరం ముఖ్య అతిధులను ఆదిత్య యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి,  ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ శరభోజి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎ. మాధవరావు, ఫిజికల్ డైరెక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us