సౌత్ జోన్ ఖో-ఖో జట్టుకు ఎంపికైన కిట్స్ విద్యార్థి

UPDATED 22nd DECEMBER 2017 FRIDAY 6:30 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం బిటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి మండల హరీష్  ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ ఖో-ఖో పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎం.ఎం.ఎస్.శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న కృష్ణా జిల్లా కంచకచర్ల ఎం.ఐ.సి. ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ ఖో-ఖో పోటీల్లో కాకినాడ జె.ఎన్.టి.యూ తరఫున పాల్గొనే జట్టు సభ్యులను ఎంపిక చేశారన్నారు. ఎంపికైన సభ్యులు కర్ణాటక రాష్ట్రం మైసూరులో జనవరి 18 నుంచి 21 వరకు జరగనున్న జాతీయస్థాయి సౌత్ జోన్ ఖో-ఖో పోటీల్లో కాకినాడ జె.ఎన్.టి.యూ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఈ సందర్భంగా హరీష్ ను కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డాక్టర్  పి.ఎం.ఎం.ఎస్.శర్మ, ఏవో సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసీవో పెదకాపు, ఫిజికల్ డైరెక్టర్ కె. ధర్మాజీ, తదితరులు అభినందించారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us