ప్రజల కోసం పనిచేస్తే చక్కటి గుర్తింపు

UPDATED 1st AUGUST 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: మంచి వ్యక్తికి మంచి గుర్తింపు ఇచ్చేవిధంగా అధికారులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని, పార్టీ నాయకులైనా, అధికారులైనా అందులో ఎలాంటి తారతమ్యాలకు తావులేదని రాష్ట్ర ఉప  ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట పట్టణంలో బుధవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి పాల్గొని 14, 15 వార్డుల్లో రూ. కోటి యాభై లక్షలు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో నిర్మించిన రోడ్లు, డ్రైనేజీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలన్నీ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ అందచేస్తున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు మంజూరు చేయడం జరిగిందని, అలాగే నీలమ్మ చెరువు, పార్కులను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని, క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతు, డ్వాక్రా రుణమాఫీ చేసిన ఘనత ఆయనదేనన్నారు. అనంతరం గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కుమారరామ భీమేశ్వర దేవస్థానం చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, కౌన్సిలర్లు రావి కస్తూరి, నేతల వెంకటలక్ష్మి, బడుగు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us