UPDATED 21st MAY 2018 MONDAY 9:30 PM
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో పంచాయతీ రాజ్ అధికారులకు 2018 -19 సంవత్సరం యాక్షన్ ప్లాన్ తయారీపై ప్రత్యేక శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమైనట్లు ట్రైనింగ్ మేనేజర్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి జూన్ నెల 20 వరకు నెల రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అధికారులకు శిక్షణ ఇస్తున్నామని, ప్రతి మండలం నుంచి ఒక ఎంపిడివో, ఒక ఈవోపీఆర్డీ, ఇద్దరు యాక్టివ్ పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి పది బ్యాచ్ లుగా విభజించి రెండురోజుల చొప్పున శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. మండల, గ్రామ పంచాయితీ స్థాయిలో యాక్షన్ ప్లాన్ల తయారీ, తదితర అంశాలపై శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎం. సిల్వియా, ఎంపిడివో జి.ఎస్. రామ్ గోపాల్, ఫ్యాకల్టీలు జె. రాంబాబు, ఎ. గోపాలరావు, టి.ఎల్.ఎన్.కె. రాజా, ఎస్.కె. మొహిద్దీన్, శేషుబాబు, రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.







