రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి

UPDATED 18TH MAY 2017 THURSDAY 5:30 PM

సామర్లకోట: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట తుట్టేరు కాలువ పూడిక పనులను ఆయన గురువారం పరిశీలించారు. కాలువ పూడిక పనులు అంచనా ప్రకారం తవ్విన కాలువ వెడల్పును ఆయన స్వయంగా రైతులు, అధికారులతో కొలిపించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కాలువ వెడల్పు సమస్య విషయంలో ఆయకట్టు రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా అధికారులతో మంత్రి మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ తుట్టేరు కాలువకు రూ. 26 లక్షలు మంజూరు చేయించి 8 కిలోమీటర్ల మేర కాలువ పూడిక పనులు చేపట్టడం జరిగిందన్నారు. నెలాఖరుకల్లా కాలువ పనులు పూర్తి చేయాలని, అవసమైతే అదనంగా మరో ప్రొక్లైనర్ ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట వైస్ ఎంపిపి ఎ.సత్తిబాబు, గుమ్మళ్ల రామకృష్ణ, డ్రైనేజీ ఈఈ విజయకుమార్, డిఈఈ నరసింహారావు, ఎఈ కె వి మంగేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మన్యం చంద్రరావు, రైతులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us