Updated 24 January 2022 Monday 01:00 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది రవితేజ కోర్టుకు తెలిపారు. నోటీసు లేకుండా జీతాల్లో కోత విధించడం చట్ట విరుద్ధమన్నారు. హెర్ఆర్ఏ విభజన చట్టప్రకారం జరగలేదని ఉన్నత న్యాయస్థానానికి వివరించారు.







