UPDATED 3rd MAY 2017 SATURDAY 3:00 PM
కాకినాడ: గోదావరి అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గా గన్నికృష్ణ శనివారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తాత్కాలికం గా ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపి తోట నరసింహం, శాసన మండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్యే లు వనమాడి వెంకటేశ్వరావు, దాట్ల బుచ్చిరాజు, ఎస్.వి.ఎస్.ఎస్.వర్మ, పెందుర్తి వెంకటేష్, పలువురు పార్టీ ప్రముఖులు, అభిమానులు హాజరై గన్ని కృష్ణ కు అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ క్రమశిక్షణ, సమర్ధతకు మారు పేరైన గన్ని కృష్ణ నేతృత్వంలో గుడా అభివృద్ధి దిశగా విజయాపథంలో పయనించాలన్నారు. అనంతరం గుడా చైర్మన్ గన్ని కృష్ణ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా పారిశ్రామికీకరణ అవసరాలకు అనుగుణంగా పట్టణీకరణ, ప్రజా సౌకర్యాల విస్తరణకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు డైరెక్టర్లు గా ఎలిశెట్టి చిన నారాయణ (నాని), గట్టి సత్యనారాయణ, పిల్లి రవికుమార్ తమ పదవి బాధ్యతలు చేపట్టారు.







