రూ.5.57 కోట్లతో ఆత్మా వార్షిక ప్రణాళిక

UPDATED23rd MAY 2017 TUESDAY 9:00 PM

కాకినాడ : జిల్లాలో 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5.57కోట్లతో ఆత్మా వార్షిక ప్రణాళికను ఆమోదించారు. మంగళవారం కలెక్టరేట్‌ కోర్టు హాల్ లో వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఆత్మా) జిల్లా గవర్నింగ్ బాడీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మా పిడి పి.పద్మజ ప్రవేశపెట్టిన వార్షిక ప్రణాళికను ఆమోదించి, నిధుల కోసం ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ఈ ప్రణాళిక ద్వారా జిల్లాలోని 86 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా కేటాయింపులు చేశారు. వ్యవసాయానికి రూ.103.40లక్షలు, ఉద్యానవనశాఖకు రూ.38.70లక్షలు, పట్టు పరిశ్రమకు రూ.5.24లక్షలు, మత్స్య శాఖకు రూ.22.86లక్షలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, రీసెర్చ్‌ సెంటర్లకు రూ.12.59లక్షలు, మైక్రో ఇరిగేషన్‌, డీఆర్‌డీఏకు రూ.294.71లక్షలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపుదల, శిక్షణకు రూ.268.88లక్షలు చొప్పున కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వినూత్న పద్ధతుల్లో రైతులు సుస్థిర సాగు విధానం అవలంబించడం ద్వారా ఉత్పాదకతను పెంచాలని సూచించారు. సమగ్ర వ్యవసాయ విధానం, మిశ్రమ విధానాలు ద్వారా వరి, మొక్కజొన్న, ప్రత్తి, చెరకు, పశువుల పెంపకం, కందకాల్లో చేపల పెంపకం, కూరగాయల సాగు, పండ్ల మొక్కలు పెంచడం చేపట్టాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖ డిడి లక్ష్మణరావు, పశుసంవర్థకశాఖ జెడి వెంకటేశ్వరరావు, మత్య్సశాఖ జెడి కోటేశ్వరరావు, డీఆర్‌డీఏ పిడి మల్లిబాబు, శాస్త్రవేత్త లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us