ఏపీకి తుఫాను ముప్పు

విశాఖపట్నం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష ముప్పు వీడటం లేదు. డిసెంబర్ నెల మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రలో డిసెంబర్ 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. నవంబర్ 30 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశలో పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంకి చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. ఆ తర్వాత డిసెంబర్ 2 నాటికి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అలజడి ఏర్పడుతుందని మేము అంచనా వేసాము. అల్పపీడనం ఏర్పడిన తర్వాత, తుఫాను ఏర్పడుతుందని అంచనా వేయగలమని మహాపాత్ర చెప్పారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us