ప్రజాసంక్షేమానికి అధిక ప్రాధాన్యం

UPDATED 19th SEPTEMBER 2017 TUESDAY 8:00 PM

పెద్దాపురం: ప్రజా సంక్షేమ పాలనకు టిడిపి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మండల పరిధిలోని చదలాడ  గ్రామంలో సర్పంచ్ రాగాల మాణిక్యాంబ, ఉమామహేశ్వరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ముందుగా ఎం ఎల్ సి చిక్కాల రామచంద్రరావుతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం టిడిపి ప్రభుత్వానికి రెండు కళ్ళు అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించి అందరి హృదయాల్లో ముఖ్యమంత్రి  చంద్రబాబు చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఎం ఎల్ సి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఇంటింటికి టిడిపి కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను వారు నేరుగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడాల రమేష్, జెడ్పిటీసి సుందరపల్లి శివనాగరాజు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు( కోటి), అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యుడు కందుల విశ్వేశ్వరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆచంట రాజబాబు( రాజన్న), టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, మండల కో ఆప్షన్ సభ్యుడు బొడ్డు వెంకన్న, పాలచర్ల ఉమామహేశ్వరావు(బుజ్జి), మెయిళ్ల కృష్ణమూర్తి, సీనియర్ టిడిపి నాయకుడు పచ్చిపాల సత్తిబాబు, టిడిపి యువ నాయకుడు పచ్చిపాల  సతీష్, సింగన అరవింద కుమార్, గ్రామ ఉప సర్పంచ్ కోడిగుడ్డు త్రిమూర్తులు, తదితరులు  పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us