TS News: గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లోకి రేపట్నుంచే సొమ్ము జమ!

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021‌: తెలంగాణ రైతులకు తీపి కబురు. ఈ ఏడాది యాసంగి సీజన్ సంబంధించి రాష్ట్రంలో రేపట్నుంచే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం నిధులు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏడు విడతల్లో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు.ఈ సీజన్‌తో కలుపుకొంటే మొత్తం రూ.50వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమ పూర్తవుతుందన్నారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ యాసంగి సీజన్‌లో 66.61 లక్షల మంది రైతులుకుగాను 152.91 లక్షల ఎకరాలకు రూ.7645.66 కోట్లు జమ చేసేందుకు సన్నద్ధమైనట్టు తెలిపారు. దీంట్లో 3.05 లక్షల ఎకరాలకు గాను 94 వేల మంది రైతులు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులు, ఎకరా నుండి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా ఆరోహణా క్రమంలో నిధులు జమ చేస్తామని వివరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us