ఏలూరు సీఐ బాలరాజాజీ సస్పెన్షన్

‘యువతిపై అత్యాచారం’ ఆరోపణల నేపథ్యంలో చర్యలు

ఏలూరు (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సీఐ బాలరాజాజీపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆయనను సస్పెండ్‌ చేస్తూ డీఐజీ మోహనరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన యువతితో సీఐ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటూ, ఆపై అత్యాచారం చేసి బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ విచారణ చేపట్టారు.

హనీట్రాప్‌లో సీఐ..?

కాగా.. సదరు సీఐ హనీట్రాప్‌లో పడినట్లు తెలుస్తోంది. దానిపైనా అధికారులు విచారణ చేపట్టారు. నగరానికి చెందిన ఓ యువతి అతనితో పరిచయం పెంచుకుని దగ్గరైనట్లు సమాచారం. తర్వాత వారి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయని తెలిసింది. పోస్టింగుల వ్యవహారంలోనూ బాలరాజాజీ వివాదంలో చిక్కుకున్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. తనను బదిలీ చేస్తారని తెలియడంతో ఏలూరు నియోజకవర్గంలోనే పోస్టింగ్‌ వేయించుకునేందుకు ప్రయత్నం చేశారని, దీన్ని ఆ శాఖలోనే కొందరు అడ్డుకోవటంతో వివాదం ముదిరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో యువతి వివాదాన్ని కొందరు తెరపైకి తీసుకొచ్చి ఆమెను రెచ్చగొట్టడంతో పోలీసులను ఆశ్రయించినట్లు చెబుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us