Emergency Landing: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌

UPDATED 22 JANUARY 2022 SATURDAY 07:15 PM

శంషాబాద్‌ (రెడ్ బీ న్యూస్) : శంషాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళ్లిన ఇండిగో విమానం తిరుగుముఖం పట్టి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ అయింది. శుక్రవారం ఉదయం 45మంది ప్రయాణికులతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వైజాగ్‌ బయలుదేరిన ఇండిగో విమానం వైజాగ్‌ చేరుకుంది. అక్కడ దట్టమైన పొగమంచు కారణంగా విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుమతి లభించలేదు. దీంతో విమానం పలుమార్లు గాల్లో చక్కర్లు కొట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. విమానంలో ఉన్న ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు వేసినట్లు సమాచారం. చేసేది లేక ఫైలెట్‌ శంషాబాద్‌ ఏటీసీ అధికారులను సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. శంషాబాద్‌ ఏటీసీ అధికారులు అనుమతివ్వడంతో తిరిగి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇండిగో విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ అధికారులపై ప్రయాణికులు మండిపడ్డారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us