UPDATED 7th MARCH 2018 WEDNESDAY 5:00 PM
పెద్దాపురం: ఉపాధి సిబ్బందిపై డ్వామా పిడి జి. రాజకుమారి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో, ఏపీవోలతో నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని బుధవారం మాట్లాడారు. ముందుగా మండలాల వారీగా ఉపాధిహామీ పధకంలో ప్రగతిపై చర్చించారు. అనంతరం ఆయా మండలాల్లో జరుగుతున్న పనులపై ఎంపీడీవోలు, ఏపీవోల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం ఇంజనీరింగ్ కన్సల్టెంట్ శ్రీధర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలేశ్వరం మండలంలో పనుల పురోగతిలో జాప్యంపై నిలదీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉపాధిహామీ జాబ్ కార్డు కలిగిన కుటుంబాలకు నూరుశాతం పనిదినాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే జిల్లావ్యాప్తంగా 2 కోట్ల పనిదినాలను కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మసకపల్లి శ్రీరంగనాయకులు ఎంపీడీవో పల్లాబత్తుల వసంత మాధవి, అధికారులు పాల్గొన్నారు.







