బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

* రాష్ట్ర శాసనసభ  స్పీకర్ తమ్మినేని సీతారాం

UPDATED 20th JUNE 2020 SATURDAY 6:00 PM

రాజమహేంద్రవరం(రెడ్ బీ న్యూస్): వివిధ సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నారని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర శాసనసభ  స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి  పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో స్థానిక గోదావరి గట్టు రజక కళ్యాణ మండపం వద్ద ఉన్న జ్యోతీరావు పూలే విగ్రహం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి శనివారం నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురిలో ఇద్దరూ బీసీలు కావడం అభినందనీయమని, ముఖ్యమంత్రి రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు  సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్, మాజీ శాసన సభ్యులు రౌతు సూర్య ప్రకాశరావు, జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన రాజకుమార్, రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయం ఇంఛార్జ్ కానుబోయిన సాగర్, బీసీ సంఘం అధ్యక్షుడు మజ్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్లు పోలు  విజయలక్ష్మి, గుత్తుల మురళీధర్, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, వాకచర్ల కృష్ణ, ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబెర్ కొత్త విజయ రాజ్యలక్ష్మి, బర్రె కొండబాబు, అజ్జరపు వాసు, తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us