OTS : సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

★ ఆర్డీవో పసుపులేటి వెంకటరమణ

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్)ను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం ఆర్డీవో పి.వెంకటరమణ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు శాశ్వత గృహ హక్కు కల్పించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. 1983వ సంవత్సరం లేదా అంతకుముందుగానీ ప్రభుత్వం పేదలకు డి- ఫారం పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించి ఇవ్వడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు శాశ్వత హక్కు ఇవ్వాలని, ఇంటిపై రుణం తీసుకునేందుకు, అవసరమైతే వారి పిల్లలకు పసుపు కుంకుమ నిమిత్తం ఇచ్చుకునేందుకు, అప్పు తెచ్చుకునేందుకు, ఇల్లు విక్రయించుకునేందుకు వారికి హక్కు కల్పించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.15 వేలు రుసుము చెల్లించి పట్టా పొందవచ్చని, ఈప్రక్రియ ఉగాది వరకూ కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిస్వార్థంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, గృహ లబ్ధిదారులు ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం మండల పరిధిలోని కాండ్రకోట, చదలాడ, తిరుపతి, జి. రాగంపేట, కట్టమూరు గ్రామాల్లో పర్యటించి లబ్దిదారులకు ఓటీఎస్ రుణ విముక్తి పత్రాలను ఆయన చేతులమీదుగా అందచేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us